JGL: శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన జిల్లా స్థాయి కూచిపూడి నాట్యపోటీల్లో జగిత్యాలకు చెందిన చిన్నారి మహాదేవుని నిత్యశ్రీ ద్వితీయ బహుమతి సాధించింది. శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం నాట్యగురువు గుండి యమున శిక్షణలో నిత్యశ్రీ ఈ ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు ఈ అవార్డును మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అందించారు.
తెలంగాణ
కూచిపూడి పోటీల్లో నిత్యశ్రీ ప్రతిభ


