ASR: వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో జిల్లా పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. శనివారం సుమారు 2,500 మంది గుహలను సందర్శించగా రూ.1.90 లక్షల ఆదాయం సమకూరినట్లు యూనిట్ మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు. ఆదివారం 3,900 మంది సందర్శకులు రాగా రూ.3.12 లక్షల ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
బొర్రా గుహలకు పోటెత్తిన పర్యాటకులు


