హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా 1000 మట్టి వినాయకుల పంపిణీ

PLD: నరసరావుపేట గణేష్ సెంటర్‌లో విజయగణపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని 1,000 మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.