హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండిపోతున్న పంటలను పరిశీలించిన కాటాసాని

NDL: పాణ్యం మండలం తమ్మరాజుపల్లె పరిధిలో ఎండిపోతున్న పంటలను వైసీసీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. గోరకల్లు రిజర్వాయర్‌లో నీరు ఉన్నా పంటలకు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.