ADB: తాంసి మండలంలోని జామిడి గ్రామ సర్పంచ్ ఇరుగోళ్ల అశోక్ పర్యావరణ పరిరక్షణలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. గ్రామంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభకార్యాల వేళ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ మంచి ప్రయత్నాన్ని గ్రామస్తులు, యువకులు అభినందిస్తున్నారు.
తెలంగాణ
మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్


