SRCL: సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన మార్కెట్ ప్రాంతం వినాయక చవితి పర్వదినం సందర్భంగా కొనుగోలుదారులతో సందడిగా మారింది. పూజా సామగ్రి, పూలు, పండ్లు, వినాయక విగ్రహాలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో మార్కెట్‌లో రద్దీ పెరిగి రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం వేళ జనసందడి మరింత అధికమైంది.
తెలంగాణ
వినాయక చవితి కొనుగోళ్లతో సిరిసిల్ల మార్కెట్ సందడి


