హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NGKL: వినాయక చవితి సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.