హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ

NZB: మండలంలోని గడ్కోల్, రామడుగు, కొండాపూర్, తుంపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఆదివారం పరిశీలించారు. గడ్కోల్‌లో పీఎస్ నంబర్లు 281, 282, 283, 284 కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్.ఐ, సర్పంచ్, బిఎల్వో పాల్గొన్నారు.