MDK: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నీటి కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి గణపతులనే ప్రతిష్టించాలని కోరారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే నిమజ్జనం పూర్తి చేసి, పండుగను ఐకమత్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్


