WGL: వర్ధన్నపేట పట్టణంలోని సత్యగణపతి బేకరీలో బూజుపట్టిన దిల్‌పసంద్ విక్రయించిన ఘటన ఆదివారం కలకలం రేపింది. మైనార్టీ పాఠశాల విద్యార్థుల కోసం కొనుగోలు చేసిన తినుబండారంలో బూజు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యతలేని ఆహార పదార్థాల విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
వర్ధన్నపేటలో బూజుపట్టిన దిల్‌పసంద్ విక్రయం


