VSP: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 51వ వార్డు మాధవధారలోని కనకమహాలక్ష్మి ఆలయం వద్ద ఓ యూత్ కమిటీ ఆధ్వర్యంలో 36 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కమిటీ సభ్యులు ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ సబ్‌డివిజన్ ఏసీపీ పేడాడ ప్రదీప్తి, మాజీ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాధవధారలో 36 అడుగుల వినాయకుడు


