హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ తొలి పూజ ఎప్పుడంటే?

HYD: ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల ఎత్తులో, ఐదు పడగలు, పంచముఖాలతో సోమవారం భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇరువైపులా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఈ నెల 25 వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కాగా, రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలి పూజ చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకోనున్నారు.