హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌కు భారీ షాక్

RR: కేశంపేట మండలం బొదునంపల్లిలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. పిప్పల శేఖర్, మాజీ ఉపసర్పంచ్ లింగారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ పార్టీకి శ్రీరామరక్ష అని, చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.