హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసును ఛేదించిన పోలీసులు

NGKL: నాగర్ కర్నూల్‌లోని రాంనగర్‌లో ఈ నెల 10న జరిగిన హోటల్ వ్యాపారి మహమ్మద్ కరీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే కారణమని తేలడంతో మృతుడి భార్య సలీమా బేగం, ఆమె ప్రియుడు ఎండీ గౌస్ పాషాలను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఆస్తి కోసం భర్తను చంపించినట్లు విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు.