హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ సిబ్బందికి ఇన్సూరెన్స్ బాండ్లు అందజేత

VSP: గాజువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న 30 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఒక ప్రముఖ ఆసుపత్రి సహకారంతో SBI, ఇన్సూరెన్స్ బాండ్లను ఆదివారం అందజేశారు. సీపీ శంఖబ్రత బాగ్చీ చేతుల మీదుగా సిబ్బందికి ఈ బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ అన్నేపు నరసింహమూర్తి, ఏసీపీలు భవ్య, వై. శ్రీనివాసరావు, క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.