MLG: ఏటూరునాగారం TGTWURJC హాస్టల్‌పై బీజేపీ చేస్తున్న విమర్శలు, దుష్ప్రచారం సరికాదని ఆదివారం ములుగు జిల్లా ఆత్మ కమిటీ ఛైర్మన్ చిటమట రఘు అన్నారు. విద్యార్థుల సంఖ్య 30 నుంచి 252కు పెరగడంతో నీటి సమస్య తలెత్తగా మంత్రి సీతక్క రూ.20 లక్షలు మంజూరు చేసి వసతులు కల్పించారని తెలిపారు. విద్యార్థుల భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.
తెలంగాణ
'హాస్టల్‌పై బీజేపీ దుష్ప్రచారం సరికాదు'


