NLR: నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో వింజమూరు GBKR SC కాలనీలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. కలిగిరి సీఐ ఆధ్వర్యంలో వింజమూరు, కలిగిరి, కొండాపురం ఎస్ఐలతో పాటు 30 మంది సిబ్బంది ఇళ్లు, పరిసరాలు, వాహనాలను తనిఖీ చేశారు. 33 బైకులు, మూడు ఆటోలను పరిశీలించగా అనుమానాస్పద అంశాలేవీ గుర్తించలేదు.
ఆంధ్రప్రదేశ్
వింజమూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు


