TPT: నాయుడుపేటలో వినాయక చవితి రజతోత్సవాలను పురస్కరించుకుని దర్గా రోడ్డులో భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోట్లపూడి రాజేష్ ఆధ్వర్యంలో సినిమా సెట్టింగ్ తరహాలో మండపాన్ని తీర్చిదిద్ది, 25 అడుగుల మహాకాళ్ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దర్గా రోడ్డులో భారీ వినాయక మండపం


