హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్లో వసతులు కల్పించాలని నిరసన

KRNL: ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రైతులు నిరసన చేపట్టారు. తాగునీరు, పశువులకు నీటి తొట్టెలు, షెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కన్వీనర్ మహ్మద్ తెలిపారు. గత హామీలు అమలు కాలేదని విమర్శించారు. వెంటనే వసతులు కల్పించాలని కోరారు.