హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి: కలెక్టర్

KKD: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. జిల్లా ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పీవోపీ విగ్రహాలతో పర్యావరణం దెబ్బతింటుందని, నీటిలో నిమజ్జనం చేస్తే జలకాలుష్యం ఏర్పడుతుందని హెచ్చరించారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని పిలుపునిచ్చారు.