హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపు వద్ద విరిగిన డ్రైనేజీ స్లాబు

NLG: మిర్యాలగూడ - హుజూర్‌నగర్ జాతీయ రహదారి నుండి శివాలయం ఎదురుగా జాన్ పహాడ్ వైపు వెళ్లే బైపాస్ రోడ్డు మూలమలుపు వద్ద డ్రైనేజీ పై ఏర్పాటు చేసిన కాంక్రీట్ స్లాబ్ విరిగి డ్రైనేజీలో పడి ప్రమాదకరంగా ఉంది. ఏ మాత్రo ఏమర పాటుగా ఉన్న వాహనాలు అదుపతప్పి డ్రైనేజీలో పడే ప్రమాదం పొంచివుంది. వెంటనే అధికారులు డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.