హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

101 బిందెలతో జలాభిషేకం

AKP: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ అచ్యుతాపురం మండలం హరిపాలెం-అందలాపల్లిలో మహిళలు భగీరథి మాతకు ఆదివారం 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. వరుణ దేవుని కరుణతో చెరువులు, కాలువలు, బావులు నీటితో నిండాలని, పాడిపంటలు సస్యశ్యామలంగా వర్ధిల్లాలని వారు సామూహికంగా ప్రార్థించారు. గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.