హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి నాయకుల తొలి సమన్వయ సమావేశం

ATP: అనంతపురం పార్లమెంట్ పరిధిలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకుల సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమర్థవంతమైన సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై అన్ని పార్టీల నేతలు విస్తృతంగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.