హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్

MDK: మెదక్ పట్టణం నవాబ్ పేట్ వీధిలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు పనులు నాణ్యత తో చేపట్టాలని అధికారులకు సూచించారు.