MDCL: వినాయక చవితి సందర్భంగా ఘట్కేసర్ పరిధిలో గణపతి ప్రతిమల విక్రయాలు జోరందుకున్నాయి. వివిధ పరిమాణాల్లో విగ్రహాలు అందుబాటులో ఉండగా, 5 అడుగుల ప్రతిమలు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. 10 అడుగుల ప్రతిమలకు రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ధర పలుకుతోంది. పండుగ దగ్గరపడుతుండటంతో ప్రతిమల కొనుగోళ్లకు డిమాండ్ మరింత పెరుగుతోంది.
తెలంగాణ
ఘట్కేసర్‌లో గణపతికి ఫుల్ డిమాండ్..!


