హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాతల సాయంతో వీల్‌చైర్ల పంపిణీ

నంద్యాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన ఐదు వీల్‌చైర్లను ఆదివారం పంపిణీ చేశారు. అహోబిలం దేవస్థానానికి 2, సంజీవనగర్ కోదండ రామాలయానికి 1,సిరివెళ్ల గ్రామస్తులకు 2 వీల్‌చైర్లను దాతల సహకారంతో అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు సుధా ప్రసాద్‌రెడ్డి, పీడీజీలు, సభ్యులు, దాతలు, అహోబిలం మఠం మేనేజర్ బద్రీనారాయణ పాల్గొన్నారు.