హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ నూతన మార్కెట్‌ను పరిశీలించిన అధికారులు

JN: సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. మార్కెట్‌లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాలను తనిఖీ చేశారు. కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం వ్యాపారులకు పూర్తిస్థాయి వసతులు కల్పించినట్లు తెలిపారు. వ్యాపారులంతా కొత్త మార్కెట్‌కు తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.