హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీజేలకు అనుమతి లేదు'

NZB: గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని ధర్పల్లి ఎస్సై జి. సందీప్ స్పష్టం చేశారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేవలం రెండు బాక్సులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. భక్తులు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్సై సూచించారు.