హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇందిరాపార్క్ వద్ద దళితుల నిరసన

HYD: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద దళితులు నిరసన తెలిపితే పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద దళితులు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పసుపు నీళ్ల శుద్ధిని, అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను, ఉద్యమకారుల పోరాటాలను గుర్తు చేశారు.