హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకొని ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

BDK: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో కిరాయికి ఉంటున్న ఆటో డ్రైవర్‌ దేవిన్ని సీతయ్య(45) ఆదివారం ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సీతయ్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.