హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతాంగ సమస్యలపై ఈనెల 18న కలెక్టర్ కార్యాలయం ముట్టడి

MNCL: AIKMS ఆధ్వర్యంలో ఈనెల 17న మండల కేంద్రాల్లో, 18న జిల్లా కేంద్రాల్లో రైతాంగ సమస్యలపై ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి ఆదివారం తెలిపారు. ఈనెల 18న కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు తమ సమస్యలపై అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.