హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పటేల్ చొరవతో నిజాం నుంచి విముక్తి లభించింది'

HYD: ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. సర్దార్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించిందని బీజేపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సన్మానించి, వారి త్యాగాలను భావితరాలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.