హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'

KNR: గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. మండపాల నిర్వాహకులు పోలీస్, విద్యుత్, ఫైర్ శాఖల నిబంధనలు పాటించాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. డీజేలు, టపాసులు, మద్యం, జూదం నిషేధమని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలన్నారు.