హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షాలు.. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

WGL: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ డా. సత్య శారద అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసర సమాచారం కోసం 9154252936ను సంప్రదించాలని సూచించారు.