హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైనథ్‌లో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు

ADB: జైనథ్ మండల కేంద్రంలో ఇళ్ల మధ్య, ప్రధాన రహదారి పక్కనే ఏర్పాటు చేసిన 100, 63 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే తొలగించి, సురక్షిత ప్రాంతానికి మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.