ADB: రేపు వినాయక చవితి పండుగనుపురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లు సందడిగా మారాయి. గణేశ్ విగ్రహాలు, పూజా సామగ్రి, పూలు, పండ్లు, అలంకరణ వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పట్టణంలోని మార్కెట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ పరిమాణాల్లో గణేశ్ విగ్రహాలను విక్రయానికి ఏర్పాటు చేయగా విగ్రహాలు కొనుగోలుచేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఆదిలాబాద్ మార్కెట్ పండుగ సందడి


