హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తిగత దూషణలకు పాల్పడితే కేసులు: డీఎస్పీ

ASF: రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దిన్‌ హెచ్చరించారు. ప్రెస్‌మీట్లు, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు, అవమానకర పోస్టులు చేయొద్దన్నారు. రాజకీయ విధానాలు, ప్రజా సమస్యలపై విమర్శలు చేసుకోవచ్చని, వ్యక్తిగత దూషణలకు దిగితే కేసులు నమోదు చేస్తామన్నారు.