కృష్ణా: వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో స్వగ్రామమైన పామర్రుకు బయలుదేరిన ఓ కుటుంబానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉయ్యూరు వద్ద విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీ వర్షం కారణంగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి ఫ్లైఓవర్ డ్రైనేజీ బల్లలపైకి ఎక్కింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యూరులో అదుపు తప్పిన కారు


