హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అద్భుతం.. వెదురు కర్రలతో వినాయకుడు

JGL: రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కళాకారుడు ఊరే నర్సయ్య రూపొందించిన వెదురు బొంగు కర్రల వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తూ, సంప్రదాయ కళలను కాపాడుతూ పర్యావరణహితంగా ఈ వినాయకుడిని రూపొందించానని నర్సయ తెలిపారు. దీని తయారీకి రూ.12000 ఖర్చయిందని, కోరుట్లలోని ఓ మండపం నిర్వాహకులు తయారు చేయించారని పేర్కొన్నారు.