కృష్ణా: బంటుమిల్లి మండలం పెందూరు గ్రామానికి చెందిన వీఆర్ఏ కడపకొల్లు ఆదినారాయణ (38) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మంగళగిరి ఎయిమ్స్‌లో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరితో స్నేహంగా ఉండే ఆదినారాయణ మృతిపట్ల రెవెన్యూ అధికారులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బంటుమిల్లి వీఆర్ఏ మృతి


