హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా మరుగుదొడ్లు.. నిరుపయోగమే

BDK: పాల్వంచ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ అటకెక్కుతోంది. నవభారత్ ఏరియాలోని మరుగుదొడ్డి తలుపులు విరిగిపోయి అధ్వానంగా తయారైంది. ఇవి జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఒంటికి, రెంటికి వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరి స్తున్నారని స్థానికులు వాపోతున్నారు.