హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతుల కలకలం.. మహిళపై దాడి..!

కరీంనగర్: నగరంలోని భగత్ నగర్‌లో కోతులు తీవ్ర భయాందోళన సృష్టించాయి. బాటసారిగా వెళ్తున్న ఓ మహిళపై హఠాత్తుగా దాడి చేయడంతో గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి కోతుల బెడద నుంచి శాశ్వత విముక్తి కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.