హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

ADB: వినాయక చవితి సందర్భంగా ప్రజలకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.