BDK: ములకలపల్లి మండలం కంపగూడెం గ్రామంలో గత నెల రోజులుగా తీవ్రమైన మంచినీటి సమస్య వేధిస్తోంది. దీనిపై గ్రామపంచాయతీ సెక్రెటరీకి, సర్పంచ్‌కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీపీఐ పార్టీ కార్యదర్శి నరాటి రమేష్ ఆధ్వర్యంలో కంపగూడెం క్రాస్ రోడ్ వద్ద ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
తెలంగాణ
ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన గ్రామస్తులు


