MNCL: తాండూరు మండల పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. తాండూర్ సీఐ దేవయ్య మాట్లాడుతూ వినాయక చతుర్థి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, చట్ట నిబంధనలకు లోబడి నిర్వహించాలని మండపాల నిర్వాహకులకు సూచించారు.అత్యవసర పరిస్థితి లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశం


