హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

BDK: మణుగూరు మండలంలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాలీలో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీని స్వాధీనం చేసుకుని మణుగూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.