JN: రఘునాథపల్లి మండలం ఖీలాషాపూర్ కేజీబీవీ హాస్టల్‌లో వారం రోజులుగా తాగునీరు, వాష్‌రూమ్, డ్రైనేజీ సమస్యలతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారని ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ అన్నారు. సమస్యలతో బాలికలను ఇళ్లకు పంపడం వల్ల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. కలెక్టర్ స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
KGBVలోని సమస్యలు పరిష్కరించాలి: రాజేందర్ నాయక్


