హైదరాబాద్: 28°C
తెలంగాణ

బావిలో పడ్డ నక్కలకు ప్రాణదానం

SDPT: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న నక్కలను అటవీ శాఖ అధికారులు రక్షించిన ఘటన హుస్నాబాద్(M) మాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో నక్కలు పడిపోవడాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సుదీర్ఘంగా శ్రమించి నక్కలను వెలికితీశారు.