హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంజయ్య సంకల్పం.. మట్టి విగ్రహాలు ఉచితం

BHNG: పర్యావరణాన్ని పరిరక్షణే ధ్యేయంగా యాదగిరిగుట్ట మండలం కాచారానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ వంగపల్లి అంజయ్యస్వామి కృషి చేస్తున్నారు. ప్రతి ఏటా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత పదేళ్లుగా యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట మండలాల్లో ఏటా 1,500 మట్టి విగ్రహాలను సొంత ఖర్చులతో పంచుతున్నారు.