ASF: రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ వహీదుద్దిన్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు, అవమానకర పోస్టులు చేయొద్దన్నారు. ప్రజా సమస్యలపై విమర్శలు చేసుకోవచ్చని, వ్యక్తిగత దూషణలకు దిగితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చర్యలు తప్పవు'


